ఈతరం భారతం/అక్టోబర్ 13/సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ , ఖమ్మం :
ఆన్లైన్ లో పార్ట్ టైమ్ జాబ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి,సుమారు 30 లక్షలు రూపాయలు మోసం చేసిన కేసులో ఒక్కరినీ ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు మహారాష్ట్ర లో ని ఔరంగబాద్ జిల్లా ఛత్రపతి శంబాజీ నగర్ లో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ గారు తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా వెంసూర్ మండలం కి చెందిన ప్రవైట్ ఉద్యోగి కి టెలిగ్రామ్ ద్వారా పరిచయం అయి ఆన్లైన్ లో పార్ట్ టైమ్ జాబ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి టెలీ గ్రామ్ మరియు వాట్సప్ ద్వారా సుమారు 30 లక్షలు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను “ 5” లక్షల రూపాయిలు అక్కౌంట్ కి వెళ్ళిన అక్కౌంట్ హోల్డర్ అయిన రవీంద్ర లక్ష్మణ్ రావు జారస్,వయస్సు 40 సం. అతనిని గుర్తించి మహారాష్ట్ర లో ని ఔరంగబాద్ జిల్లా ,కేశర్సింగ్ పుర,కోకాన్వాడీ ఛత్రపతి శంబాజీ నగర్ లో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి,రిమాండ్ కి తరలించారు.















