EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా సంపాదకులు సౌత్ ఇండియా టైమ్స్ చైర్మన్  చిలుక వేణు గోపాల్ రెడ్డి

ఈతరం భారతం అక్టోబర్ 14, హైదరాబాద్: చిలుక వేణుగోపాల్ రెడ్డి సంపాదకులు సౌత్ ఇండియా టైమ్స్ చైర్మన్ ను సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సీమ) జాతీయ అధ్యక్షులు కే ఆదినారాయణమూర్తి ఆదేశాల మేరకు సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ ( సీమ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా2025-27 వ్యవధికి గాను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసారు. ఈ సందర్బంగా సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి స్వామి మాట్లాడుతూ  చిలుక వేణుగోపాల్ రెడ్డి ని అభినందిస్తూ, సమర్థవంతంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారని తెలంగాణ వ్యాప్తంగా సీమ కార్యకలాపాల విస్తరణ కు కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. అలాగే వివిధ పత్రికలలో, టెలివిజన్లలో పనిచేస్తున్న పాత్రికేయుల దైనందిన జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయులకు కల్పిస్తున్న సదుపాయాల్ని విస్తృతస్థాయిలో పాత్రికేయులకు చేరేలా, వారి హక్కుల సాధనకు పాటుపడాలని, ఇంకా ఇలాంటి గొప్ప బాధ్యతలను విజయాలను మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని అభినందిస్తూ వారికి ఈ అవకాశం వచ్చినందుకు హర్షం వ్యక్తపరిచారు.

Related News

Select the Topic
Scroll to Top