EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బిసి ల బందుకు తెలంగాణ రాష్ట్రీయ జనతాదళ్ సంపూర్ణ మద్దతు     తెలంగాణ రాష్ట్రీయ జనతాదళ్ రాష్ట్ర అద్యక్షులు శోభ యాదవ్ 

హైదరాబాద్ అక్టోబర్ 17 (ఈతరం భారతం);చట్ట సబల్లో బిసిలకు 42% రిజర్వేషన్ లు కల్పించాలని, వీటిపై రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన స్టె కు వ్యతిరేకంగా బిసి సంఘాల జేఏసి అక్టోబర్ 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ రాష్ట్రీయ జనతాదళ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షులు శోభ యాదవ్ తెలిపారు. అక్టోబర్ 18న జరుగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌కు బీసీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని శోభ యాదవ్ పిలుపు నిచ్చారు.ఈ బంద్ బీసీ సమాజ హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం, మరియు 42% రిజర్వేషన్ సాధన కోసం జరుగుతోంది.ఈ బంద్ విజయవంతం కావడానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, ఎంప్లాయిస్ యూనియన్లు, కార్మిక సంఘాలు, యువజనులు మరియు మహిళలు ఐక్యంగా ముందుకు రావాలన్నారు.మన హక్కుల కోసం జరిగే ఈ ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, మరియు బీసీ సశక్తీకరణకు ఒక చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుంది. 42% రిజర్వేషన్ – మన హక్కు, మన గౌరవం! అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top