ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 18 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ యూనిట్లను నెలకొల్పడానికి రూ. 50 వేల నుండి రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. యూనిట్ ఖర్చును బట్టి 70% నుండి 100% వరకు సబ్సిడీతో పాటు, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందిస్తారు. వల్నరబుల్ గ్రూప్స్ కు లక్ష వరకు 90% సబ్సిడీ, మైనర్ ఇరిగేషన్ కు వంద శాతం సబ్సిడీ లభిస్తుంది.















