వరంగల్ అక్టోబర్ 18 (ఈతరం భారతం);బిసి ల కు సంబంధించి 42శాతం రిజర్వేషన్స్ విషయం లో తెలంగాణా హైకోర్ట్ ఇచ్చిన స్టే కు వ్యతిరేకంగా బిసి సంఘాల జేఏసి ఇచ్చిన పిలుపుకు మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ బందు పిలుపుకు మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో బీసీ బంద్ విజయవంతమైంది. ఈ బంద్ కార్యక్రమం లో బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేష్, గుండె నరేందర్ , గోరింటల్ రాజు, బసవరాజ్ శ్రీమాన్, కరేట ప్రభాకర్, ఎల్ శీను, కే సదానందం, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్ బందు కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేసినట్లు ఎమ్మెల్సీ గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తెలిపారు.















