ఈతరం భారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 19 :
తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు.. తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGPICS )గా మారింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎండీ ఎం.రమేశ్ తెలిపారు. కార్పొరేషన్ పేరును సవరించడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు తెలిపారు. TGPICS వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, విస్తరణ, సాంకేతిక సదుపాయాలను అందించడం, ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ నిర్వహణ, డిజైన్లు, లాజిస్టిక్స్ సంబంధిత రంగాల్లో కన్సల్టెన్సీ సేవలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.















