ఈ తరం భారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 19 :
హైదరాబాద్‌లోని మూసపేట్ మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడివద్ద బుల్లెట్ లభించడం కలకలం రేపింది.బిహార్‌కు చెందినమహమ్మద్ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్చేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ బ్యాగ్ మూసాపేట మెట్రో స్టేషన్‌కు వచ్చాడు సాధారణ స్కానింగ్‌లో భాగంగా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
అతడిని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా 9 ఎంఎం బుల్లెట్ లభించింది. దీనిపై కూకట్పల్లి పోలీసులకు మెట్రోస్టేషన్ సిబ్బంది.ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లుపోలీసులు తెలిపారు.















