ఈతరం భారతం/యాదాద్రి భువనగిరి/ అక్టోబర్ 20 : జిల్లా పరిధిలోని ఆలేరు మున్సిపల్ కేంద్రం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఆయన నివాసంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఐలయ్య నాయకులు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సంఘాల నాయకులు కూడా ఐలయ్యను కలిసి దీపావళి శుభాభినందనలు అందజేశారు.















