ఈతరం భారతం/ యాదాద్రి భువనగిరి/అక్టోబర్ 20: జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గ గ్రామాలలో సోమవారం దీపావళి పర్వదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
ఆలయాలలో దీపావళి ప్రత్యేక పూజలు జరుగగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.వ్యాపార సముదాయాలలో లక్ష్మీ పూజలను నిర్వహించారు. దీపతోరణాల వెలుగుల మధ్య గ్రామాలన్నీ పండుగ వైభవాన్ని సంతరించుకున్నాయి. బాణసంచా కాల్చి పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాలతో సంబరాలలో పాల్గొన్నారు.















