EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదాద్రి క్షేత్రంలో గిరిప్రదక్షిణ  :  హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఈతరం భారతం /అక్టోబర్ 22/ యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో గిరి ప్రదక్షిణ బుధవారం ఎంతో ఘనంగా, భక్తి ప్రపత్తులతో జరిగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తోపాటు పలువురు ప్రముఖులు, భక్తులు గిరి ప్రదక్షిణ లో పాల్గొని అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాస ప్రత్యేక పూజలు కూడా జరిగాయి. యాదాద్రి క్షేత్రం అంతా కార్తీక శోభ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఏర్పాట్లను చేశారు.

Related News

Select the Topic
Scroll to Top