EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జన్ సేవా సంఘ్ ఆద్వర్యంలో ఈ నెల 28, 29 ‘ఛత్ పూజ’ ఆరాధనోత్సవాలు        జన్ సేవా సంఘ్ ప్రెసిడెంట్ ఆర్.పి. సింగ్ వెల్లడి

ఈతరం భారతం/హైదరాబాద్/ అక్టోబర్ 22 : సమాజం లో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, భక్తుల అన్ని కోర్కెలు నెరవేర్చే ఉత్తర, మధ్య భారత దేశంలోని ప్రధాన పండుగ అయిన ‘ఛత్ పూజ’ (సూర్య భగవానుడికి చేసే ఆరాధన) పూజను నగరంలో 4 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం సహాయంతో ఘనంగా నిర్వహించనున్నట్లు జన్ సేవా సంఘ్ జన్ సేవా సంఘ్ ప్రెసిడెంట్ ఆర్.పి. సింగ్ తెలిపారు. బుదవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోసంఘ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రాజీవ్ రంజన్ చౌదరి , కోశాధికారి బినీత్ కుమార్ సింగ్ తో కలసి ఆయన మాట్లాదారు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీ వికె.సింగ్(ఐపీఎస్) మార్గదర్శకత్వంలో నడుస్తున్న జన్ సేవా సంఘ్ తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉందన్నారు. ఈ 4 రోజుల పండుగ మొదటి రోజు 25న నహై-బాయ్ (స్నానం చేయడం, తినడం) రెండవ రోజు 26న ఖర్నా (ఉపవాసం, చిన్న సారి ఆహారం) మూడవ రోజు 27న సంధ్యా అర్ఘ్య(సాయంత్రం ప్రార్ధనలు), 4వ రోజు 28న ఉషా అర్ఘ్య (ఉదయం ప్రార్ధనల సమర్పణ) ఉంటుందని అన్నారు. ఛత్ పండుగ కార్యక్రమాలలో భాగంగా ఈనెల 27వ తేది సాయంత్రం 3. గంటలనుండి 7 గంటల వరకు, 28వ తేది ఉదయం 4 గంటలనుండి 7 గంటలవరకు సూర్య భగవానుడికి నదీ, సరస్సులు, నీటి వనరుల ఒడ్డున ప్రార్ధనలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం లో మొత్తం 28 చెరువులు(ఘాట్స్) లవద్ద నిర్వహించే ఈ పూజా కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రెస్, వ్యాపారవేత్తలు, ప్రముఖ నిపుణులను ఛత్ ఘాట్ల వద్ద ప్రార్ధనలు చేసేందుకు ఆహ్వానించామని తెలిపారు. పండుగ ఏర్పాట్లకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరికి, డిజిపికి, పోలీస్ కమీషనర్లకు, జిహెచ్ఎంసి, హెచ్ఎమ్ డిఎ కమిషనర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వేలాది మంది సంఘ్ వాలంటీర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ee పూజా కార్యక్రక్మాల్లో పల్గోనే9848024483, 9030375149, 9849547916 నమ్బర్లను సంప్రదిన్చాలనిం కోరారు.వారు ఈ సమావేశంలో సీతారం ఠాకూర్ , రాధే శ్యామ్,రాజేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top