EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భూములు లాక్కుంటే మాకు సావే శరణ్యం : విలేకరుల సమావేశంలో ఖమ్మం 15వ డివిజన్ అల్లిపురం దళిత రైతుల ఆవేదన

ఈతరం భారతం/ఖమ్మం/అక్టోబర్ 22: రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

మా భూములు మాకే కావాలని, జీవనోపాధితో పాటు పిల్లల చదువుకు ఉపయోగపడుతున్న భూములను దేవుని ఆలయం పేరుతో బలవంతంగా లాక్కోవటం సరైంది కాదని ఖమ్మం అర్బన్, దంసలాపురం రెవిన్యూ, 15వ డివిజన్ అల్లిపురంకు చెందిన దళిత రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళితులు మాట్లాడుతూ… ఖమ్మం అర్బన్ ధంసలాపురం రెవెన్యూ అల్లిపురం 15వ డివిజన్లోని సర్వే నెంబర్ 408 లో 15 ఎకరాల భూమిని వారసత్వంగా 12 మంది దళిత రైతులు సాగు చేసుకుంటున్నామన్నారు. పేద, అణగారిన దళిత వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 60 సంవత్సరాల క్రితం భూమిలేని నిరుపేదలకు భూములను కేటాయించిందని, వారసత్వంగా వస్తున్న ఆ భూములకు పట్టా, పాస్ పుస్తకాలు కూడా ప్రభుత్వం కేటాయించిందని తెలియజేశారు. అట్టి భూమి తప్ప మాకు వేరే భూమి లేదన్నారు. వారసత్వంగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధితో పాటు పిల్లలను చదివించుకుంటున్నామని అన్నారు. తిరుమల తిరుపతి దేవాలయం పేరుతో సాగు చేసుకుంటున్న మా భూములను స్థానిక ప్రజా ప్రతినిధులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వైఖరిని మార్చుకొని దళితుల అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. సాగు చేసుకుంటున్న మా భూములను బలవంతంగా లాక్కుంటే మాకు సావే చరణ్యం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విలేకరుల సమావేశంలో గద్దల రాంబాబు, గద్దల వెంకటరమణ, కొండ అమేల్యమ్మ, బర్ల రవి, బర్ల ఫ్రాన్సిస్, జొన్నలగడ్డ లలిత, ఆమడాల రోజమ్మ బర్ల కోటేష్, షేక్ మీరాబి, మద్దె పుల్లమ్మ, పి లలితమ్మ, గొర్రెముచ్చు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top