ఈతరం భారతం/హైదరాబాద్/ అక్టోబర్ 23 :
గోమాతను రక్షించడం ప్రతి హిందువు కర్తవ్యమని, సనాతన ధర్మంలోని పవిత్ర భాగమని ధర్మాన్ని కాపాడే గోరక్షకులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని గోరక్షకుడు సోను సింగ్ పై జరిగిన కాల్పులను మాజీ ఎంపీ, బీజేపీ ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ తీవ్రంగా ఖండించారు. యశోద ఆసుపత్రిలో గాయపడిన గోరక్షకుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోరక్షకుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.ఓల్డ్ సిటీకి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో సోను సింగ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..తుపాకీ గుండుతో ఆయనకు ఊపిరితిత్తులు, లివర్, కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఆపరేషన్ చేసిన యశోద సర్జికల్ టీం బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించింది, కానీ నేను ఒక డాక్టర్ గా నా సహచర వైద్యులతో మాట్లాడి చూసిన తర్వాత పేషెంట్ పరిస్థితి ఇంకా క్రిటికల్‌గా ఉంది.మరుసటి 72 గంటలు అత్యంత కీలకం. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చాను.మన దేశంలో గోమాత పూజనీయురాలు.ఆ గోమాతను రక్షించడం ప్రతి హిందువు కర్తవ్యం, సనాతన ధర్మంలోని పవిత్ర భాగం.అదే ధర్మాన్ని కాపాడే గోరక్షకులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరం.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత,గోవులను అక్రమంగా తరలించే వారిని కాపాడుతూ,గోరక్షకులపై దాడులు, హింసలు, కాల్పులు పెరుగుతున్నాయి.ఇటీవల వాహనాలతో తొక్కే ప్రయత్నాలు, శారీరక దాడులు, ఇప్పుడు కాల్పులుఇవి రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈరోజు జరిగిన ఘట్కేసర్ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. కాల్పులకు పాల్పడిన ఇబ్రహీంను వెంటనే అరెస్టు చేసి, చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.ఇటీవల నిజామాబాద్‌లో కూడా పోలీసులు హత్యకు గురయ్యారు.ఇప్పుడు ఘట్కేసర్‌లో గోరక్షకుడిపై కాల్పులు జరిపి పోలీసులు, ప్రజలను ఛాలెంజ్ చేస్తున్నారు.ఇది ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది అని అన్నారు















