EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పెద్ద అంబర్‌పేట్‌ వద్ద ఒఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా : ఆరుగురికి గాయాలు..

ఈతరంభారతం/హైదరాబాద్/ అక్టోబర్ 25:

రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట్‌ వద్ద ఒఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడడంతో డిఆర్ డిఒ, హయత్ నగర్ లో వివిధ ఆస్పత్రులకు తరలించారు. న్యూ గో ట్రావెల్స్ బస్సు మియాపూర్‌ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పైనుంచి కిందకు దిగుతుండగా మూలమలుపు వద్ద బోల్తాపడింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related News

Select the Topic
Scroll to Top