EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బీసీలను అవమానిస్తున్న బిఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి :  బిఆర్ఎస్ పై 15 బీసీ సంఘాల పైర్

ఈతరం భారతం/హైదరాబాద్ /అక్టోబర్ 25 :

ఇంకోసారి బీసీలను రౌడీలు అంటే అగ్రకుల నాయకులకు బుద్ధి చెబుతాం అని బిఆర్ఎస్ పై 15 బీసీ సంఘాలు హెచ్చరించాయి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అవమానించడం టిఆర్ఎస్ పార్టీ అలవాటుగా చేసుకుందని ఇందుకు నాటి ప్రొఫెసర్ జయశంకర్ నుండి మొదలుకుంటే నేటి నవీన్ యాదవ్ వరకు టిఆర్ఎస్ పార్టీ అహంకారం ఆధిపత్యంతో అవమానిస్తున్నది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు నేడు హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 15 బీసీ సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు బిసి సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్,ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ కి టికెట్ కేటాయించిందని వారు అనడాన్ని బీసీ సంఘాలుగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు రాజకీయ నిరుద్యోగి ఉన్న కేసీఆర్ కు తెలంగాణ భావజాల ఉద్యమాన్ని అందించిన ప్రొఫెసర్ జయశంకర్ తన సొంత ఇంటి నే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కెసిఆర్ కు రాజకీయంగా అండదండలు అందించిన టైగర్ నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య నుండి ఈటల రాజేందర్ వరకు వారిని ఉపయోగించుకుని తర్వాత అవమానకరమైన రీతిలో వ్యవహరించిన పార్టీ టిఆర్ఎస్ అని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు భూ కబ్జాలకు పాల్పడి సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి అనేకమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ల పై అక్రమ కేసులు బనాయించి అందరి జీవితాలతో ఆటలాడుకునీ ఇద్దరు భార్యలతో రోడ్డుకెక్కి, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని తన్నుకొని దౌర్జన్యానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వాళ్ల దృష్టిలో మంచోడు, పేద ప్రజలకు అండగా నిలబడి అందరి కష్టసుఖాల్లో ఒకరిగా జీవించి తమ వృత్తిని నమ్ముకుని నిజాయితీగా జీవించిన బీసీ బిడ్డలైన చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన కుమారుడు నవీన్ యాదవులను మాత్రం టిఆర్ఎస్ నేత కేసిఆర్ రౌడీ షీట్ లుగా పేర్కొనడం తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలను అవమానించడమేనని, బీసీల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ దోరతనంతో కెసిఆర్ వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్, మండిపడ్డారు బీసీలపై కేసీఆర్ కు చిత్త శుద్ధి ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు తమకున్న బీసీ వ్యతిరేక భావనతో అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతూ బీసీలను బట్ట కాల్చి మీద వేసే కార్యక్రమం చేస్తూ బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా బీసీలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా కుట్ర చేస్తున్నారని బీసీలంతా ఏకమై వారి కుట్రలను ఎండగట్టి ఓటు అనే ఆయుధం ద్వారా టిఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బుద్ధి చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు దొంగే,దొంగ, దొంగ.. అని అరిచినట్టు అగ్రకులాలలో ఉన్న అసలైన రౌడీలు గుండాలు భూకబ్జాదారులు నేరస్తులు గురివింద గింజలగా బీసీలను రౌడీషీటర్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు, బీసీలపై టిఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే బీసీలే ఏకమై బిఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గోరి కట్టనున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ ఏ కులాల అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం బాగయ్య, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కేపీ మురళీకృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధీటి మల్లయ్య, విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు కవుల జగన్నాథం, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ, సమత యాదవ్, లచ్చయ్య గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, నరసింహ చారి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top