ఈతరం భారతం/ ఖమ్మం / ఆక్టోబర్ 29 : (మధుశ్రీ నలుబోల )
నేడు వైద్యం వ్యాపారంగా , ఒక ఖరీదు అయిన వ్యవహారంగా మారిన నేపథ్యంలో …. నిజాయితీ వైద్యం _ సరైన ఎంపిక కు డాక్టర్ శీలం పాపారావు , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరుగాంచారు. నిపుణత , నమ్మకం కు చిరునామాగా నిలిచారు. జిల్లా కేంద్ర మైన ఖమ్మం నగరం లో … పాతికేళ్ల తన వైద్య వృత్తి లో 10 వేల కు పైగా ఆపరేషన్లు నిర్వహించిన ఘనత ఆయనది .
ఒకప్పుడు ఆపరేషన్లు అంటే కోతలు,కుట్లు ,రక్తస్రావం గుర్తుకు వచ్చి ,పేషెంట్లతో పాటు వారి తాలుకు బంధువులు భయాందోళనకు లోనయ్యే వారు. ఇటు వంటి స్థితిలో డాక్టర్ శీలం పాపారావు , కుట్లు , కోతలు, రక్తస్రావం లేని ఆధునిక ఆపరేషన్ లకు శ్రీకారం చుట్టారు. అదికూడా … నిజాయితి , నమ్మకం, లాభాపేక్ష లేని సేవా దృక్పథం ,100 శాతం సక్సెస్ రేటు తో … ఆసుపత్రులకు , డాక్టర్లకు ఒక ఆదర్శప్రాయమైన రోల్ మోడల్ గా నిలిచారు. ఇప్పటికీ అదే అంకితమైన భావంతో వృత్తిపర నిబద్ధతను కాపాడుతున్నారూ…అదే సమయం లో వైద్యం , వైద్యుల ఔన్నత్యాన్ని నిలబెట్టిన ఘనత కూడా డాక్టర్ శీలం పాపారావు దే. వినటానికి చదవడానికి అతిశయోక్తిలా అనిపించిన నూటికి నూరుపాళ్ల నిజం ఇదే. అడ్వాన్స్డ్ లాపరోస్కోపిక్ విధానంతో కోత కుట్లు, ఏ విధమైన రక్తస్రావం లేని ఆపరేషన్లను ప్రారంభించి , పాతికేళ్ల తన ప్రస్థానంలో ఎలాంటి దుష్పరిణామాలను తావివ్వని విధంగా హై రిస్క్ సర్జికల్ స్పెషలిస్ట్ గా ఖమ్మంలో అగ్రభాగాన నిలిచారు. ఇప్పటికీ అదే ఒరవడి….. నిజాయితీ వైద్యం . ఫలితంగా రోగులు , వారి సన్నిహితులు బంధువులు డాక్టర్ శీలం పాపారావు అనగానే సరైన ఎంపిక అంటూ ప్రశంసిస్తున్నారు. కాబట్టి , పదివేల ఆపరేషన్లను పూర్తి చేసిన ఘనతను సాధించారు.















