ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 29 :
అంబర్పేట నుండి మూడుసార్లు శాసనసభ్యునీగా, సికింద్రాబాద్ నుండి రెండుసార్లు పార్లమెంట్ సభ్యునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీసీ లు గెలిపించారని, ఇప్పుడు గెలిపించిన బీసీల రుణం తీర్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే బాధ్యత కిషన్ రెడ్డి నే తీసుకోవాలని బీసీ జాక్ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు నేడు హైదరాబాదులోని అంబర్పేటలో ఉన్న అశోక ఫంక్షన్ హాల్ లో బీసీ జాగృతి అధ్యక్షులు కేపి మురళీకృష్ణ అధ్యక్షతన 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు-కుల సంఘాల సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గం లోని బీసీలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకు అండగా ఉన్నారని, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బీసీ నేత బండా దత్తాత్రేయ తన సీటును త్యాగం చేసి కిషన్ రెడ్డికి కేటాయించారని, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీలు మరొకసారి కిషన్ రెడ్డికి అత్యధిక ఓట్లు వేసి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారని తద్వారా వారు రెండుసార్లు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బీసీల మద్దతుతోని అయ్యారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు,
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర బంద్ నిర్వహించి లక్షలాది మంది రోడ్లమీదకి వచ్చి ఆందోళన చేపడుతున్నారని ఇలాంటి సమయంలో ఈ అంశాన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఈ చట్టాన్ని కేంద్రాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే బాధ్యత కిషన్ రెడ్డి నే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
ప్రతి ఎన్నికలలో ఆయన రాజకీ ఎదుగుదలకు అండగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు బిల్లుకు ఆమోద ముద్ర వేయించి బీసీల రుణం తీర్చుకోనే అవకాశం కిషన్ రెడ్డికి వచ్చిందని, ఇది ఆయన ఉపయోగించుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ జరపాలని, ఒకవేళ ప్రధాని, సీఎం నేతృత్వంలోని అఖిల పక్షానికి సమయం ఇవ్వకపోతే ప్రధాని నివాసం ఎదుట వంట వార్పు కార్యక్రమం నిర్వహించి బీసీల నిరసనను దేశం మొత్తం చూసేలా సీఎం నిర్ణయం తీసుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు
నవంబర్ 2న హైదరాబాదులో కళింగ భవన్ లో బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశామని ఆ సమావేశం లో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని బిసి రిజర్వేషన్లు సాధన కోసం భూకంపం సృష్టించైన 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని నమ్మకం ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గత 18వ తేదీన ఇచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతం జరిగిందని బీసీ బందు ద్వారా బీసీల డిమాండ్ ను బలంగా వినిపించ గలిగామని, కేంద్రంలో ఉన్న బిజెపిని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పై ఒత్తిడి తీసుకురావడానికి బీసీలంతా ఐక్యమత్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
తెలంగాణ బిసి జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు మురళీ కృష్ణ రాష్ట్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో దుసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, మహేందర్, ధనుంజయ లక్ష్మణ్, బి లింగం గౌడ్, రామ్మోహన్, శారదా గౌడ్ మెట్టు ధనరాజ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు















