ఈతరం భారతం /యాదాద్రి భువనగిరి/ అక్టోబర్ 30 :
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెబుతాను అని స్పష్టం చేశారు. పార్టీ మార్పు అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించారు. గంగపూజ నిర్వహించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నామని చౌటుప్పల్ చెరువుకి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు వేసి దండు మల్కాపురం లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు















