EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మున్నేరు ముంపు నిర్వాసితులకు మేము అండగా ఉంటాం….  : తోట గోవిందమ్మ

ఈ తరం భారతం/ ఖమ్మం/ అక్టోబర్ 30

మొంథా తుఫాను ప్రభావంతో గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం నగరంలోని మున్నేరు ఉదృత్తి 26 అడుగులకు చేరి 47, 48 డివిజన్ లోని పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ ప్రాంత ప్రజల ఇళ్లలోకి నీరు చేరి దిక్కుతోచని పరిస్థితుల్లో రోదిస్తున్న ఆ కుటుంబాలను 48వ డివిజన్ కార్పొరేటర్తోట గోవిందమ్మ రామారావు గార్లు అక్కున చేర్చుకుని ఆకలితో ఉన్న ఆ వందలాది కుటుంబాలకు అన్న ప్రసాదాలు అందించారు.

తదనంతరం తోట గోవిందమ్మ రామారావు గార్లు మాట్లాడుతూ రోజువారి కూలీ చేసుకునే ఈ కుటుంబాలకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మున్నేరు ఉదృత్తి వాళ్ల జీవనాన్ని చీకటిమయం చేస్తుందని, వేలాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు మానసిక రోదనను కలిగిస్తుందని. గత సంవత్సరం వచ్చిన భారీ వరదలతో సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబాలను మొంథా తుఫానుతో మున్నేరు ఉధృతిమరలా ఆ కుటుంబాలలో చీకటి క్షణాలను మిగిల్చిందని,ఆ కుటుంబాలకు ఇంటి పెద్దగా మా కుటుంబ సభ్యులతో సహా ఎల్లవేళలా అండగా ఉంటూ వారిని అనుక్షణం తమ కుటుంబ సభ్యులుగానే వారి కష్టాలలో పాలుపంచుకుంటూ రాత్రింబవళ్లు వారికి తోడుగా ఉంటూ తిండి తిప్పలకు దూరమవుతున్న ఆ బాధితులకు గతంలో అందించిన విధంగా ఈరోజు నుంచి వారు క్షేమంగా వారి ఇంటికి చేరుకునే వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న ప్రసాదములు అందించే దిశగా ఏర్పాట్లు చేశామని మీరంతా ధైర్యంగా ఉండాలని మేము మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆ గంగమ్మ తల్లి శాంతించి అమ్మవారి ఆశీస్సులతోఆ కుటుంబాలు యధా స్థితిని పొందాలని ప్రార్థిస్తూ ఈ ప్రాంత మహిళలతో కలిసి అమ్మవారికి చీర, జాకెట్, పూలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమలతో కూడిన సారను అందించటం జరిగిందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తోట రమేష్, వంగాల వెంకట్ చేతి, కృష్ణ, బాబా, కిషన్ నాయక్, నిరంజన్, కునుపూరి మహేష్ కునుపూరి మధు రవీందర్, వీరేందర్, మాధవరావు, లింగా రెడ్డి, ప్రాంత యువత, మహిళలు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top