EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారతీయ సంస్కృతి పునరుద్ధరించేందుకు మిషన్ భారత్ యాత్ర         దీపక్ బరాడియా కు భువనగిరి లో ఘన స్వాగతం 

హైదరాబాద్ (భువనగిరి ) నవంబర్ 12

భారతీయ సంస్కృతి పునరుద్ధరించేందుకు దీపక్ బరాడియా బైక్ పై చేపట్టిన మిషన్ భారత్ యాత్ర కు భువనగిరి లో ఘన స్వాగతం పలికారు.దేశ సేవలో భాగంగా “మిషన్ భారత్” పేరిట కార్గిల్ నుండి కన్యాకుమారి వరకుమొత్తం 7500 కిలోమీటర్లు దీపక్ బరాడియా బైక్ పై ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.భారతదేశంలో సుమారు ఏడు లక్షల గ్రామాలు ఉన్నప్పటికీ, వీలైనన్ని గ్రామాలను సందర్శిస్తూ మన భారతీయ సంస్కృతి పునరుద్ధరించేందుకు, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఆయన ఈ యాత్రను ప్రారంభించినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ “ప్రాజెక్ట్ భారత్”స్టేట్ హెడ్ చింత బాలయ్య తెలిపారు.ఈ స్ఫూర్తిదాయక యాత్రకు మద్దతుగా బుదవారం ఆనంద నిలయం వివేరా హోటల్ దగ్గర, లక్ష్మీనరసింహ కాలేజ్ ముందు దీపక్ బరాడియాను అభినందించి, సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ “ప్రాజెక్ట్ భారత్” సభ్యులు రవి , గడ్డం శ్రీనివాస్ , చెంద్రశేఖర్ ,హన్మంతరావు మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ భువనగిరి టీమ్ సబ్యులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top