ఈతరం భారతం సంగారెడ్డి ఏప్రిల్ 10
సంగారేడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారేడ్డిపేట గ్రామంలో భక్తుల పాలిట కల్పవల్లిగా వెలసిన శ్రీ తుల్జాభవాని మాత 33వ వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారికి ఆలయ పూజారి మాత నర్సమాంబ గారి అద్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయంత్రం గ్రామ శివారులోని సంగమేశ్వర ఆలయం నుంచి మంజీరా నది నుండి తీసుకు వచ్చిన నీటిని రాగి కలశాలతో ఏకరూప దుస్తులు దరించిన 251మంది మహిళలు తుల్జాభవాని ఆలయం వద్దకు మంగళ వాయిద్యాలతో తీసుకు వచ్చి భవాని మాతకు అభిషేకం చేశారు. గ్రామానికి చెందిన బాలికల కోలాటం,నృత్యలుఅందరిని అకట్టుకున్నాయి.ఉత్సవాలకు వచ్చికన భక్తులకు ఏలాంటి ఇబ్బండి లేకుండా ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలలో సదాశివపేట ప్రముఖ వ్యపార వేత్త చిందికేరి సత్తిష్ కుమార్, రాజు పటేల్, కాంగ్రేస్ నాయకులు కుమ్మరి లింగయ్య, అలయ పూజారి పరుశురామ్, చిందం నగేష్ తదితరులు పాల్గోన్నారు.















