ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 7 సోమవారం
_________________________________________
ఉపాధ్యాయ దినోత్సవం ను పురస్కరించుకొని లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆద్వర్యం లో బోయినపల్లి లోని శోభా గార్డెన్స్ లో శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ విద్యాలయ నందు అధ్యాపకుని గా కామర్స్ భోదిస్తున్న బియ్యపు శంకర్ యాదవ్ ను ఉత్తమ అధ్యాపకుని గా ఎంపిక చేసి సత్కారించారు.ఈ కార్యక్రమం లొ ప్రముఖ సహస్రవధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు , లయన్స్ క్లబ్ గవర్నర్ శశికాంత్, లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాపాక రాయమల్లు, ఈవెంట్ ఛైర్పర్సన్ భారత్ రాజ్, తెలంగాణ కు చెందిన అనేక పాఠశాలల, కళాశాల ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీ స్వామి నారాయణ గురుకుల్ విద్యాలయ యాజమాన్యం, పూజ్య పాధ్ సుఖీవల్లభదాస్ స్వామీజీ, హరివల్లభదాస్ స్వామీజీ, సి ఈ. ఓ. సతీష్ రెడ్డి ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ , కో ఆర్డినేటర్ శ్రీనివాస్ , సహా అధ్యాపకులు, పలువురు,బియ్యపు శంకర్ యాదవ్ కు అభినందనలు తెలిపారు.















