ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 8:
________________________________
హామీలు అమలుపరచని రేవంత్ సర్కార్ వెంటనే రాజీనామా చేయాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదేశాలతో సీతాఫల్మండి, బౌద్ధనగర్ డివిజన్ల మాజీ కార్పొ రేటర్ల ఆద్వర్యం లో సీతాపల్ మండి లో ధర్నానిర్వహించారు.దీంతోసికింద్రాబాద్..రామ్ నగర్ వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, అమలు కాని హామీలను ఇచ్చి తప్పుదారిలో అధికారంలోకి వచ్చింద న్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వారాసిగూడ చౌరస్తా నుండి ర్యాలీని ప్రారంభించి సీతాఫల్మండి, నామాలగుండు, సీతాఫల్మండి చౌరస్తా, వరకు కొన సాగించి అనంతరం రొడ్ఫు పై బైఠాయించి ధర్నా .
ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు కావస్తున్నాపేదలకు ఇప్పటికీ ఆర్థిక సాయం చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్బంగాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాలను దహనం చేశారు. అనంతరం సికింద్రాబాద్ జీహెచ్ఎం సి కార్యలయానికి వెళ్లి కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది శైలజ,సామల హేమా సీనియర్ నాయకులు బల్ల గీత, బెజ్జంకి రాజేష్, మిట్టపల్లి బాబురావు, శైలేందర్, నారాయణ, కరాటే రాజు, సుజాత, సుమలత, ఫరీదా, లత, సులోచన, నందిత, మానస, ఆంజనేయులు గౌడ్, బస్తాన్ బాబా ఇతర నేతలు పాల్గొన్నారు.















