ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 7 సోమవారం
__________________________________________
అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘటనలపై రాష్ట్ర హోంశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోవద్దని.. నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని పేర్కొంది. “మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను గుర్తించాలి. ఈ ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశంలో డీజీపీ నివేదిక ఇవ్వాలి” అని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.















