EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 12

తనపై ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యక్తి తనను డబ్బు డిమాండ్ చేశారని, అది ఇవ్వనందుకే కక్షపూరితంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం రాబోయే బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేస్తూ పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు.రాజకీయ ప్రచారాల ద్వారా కోట్లు సంపాదించే అవకాశాలు వచ్చినా, కేవలం తన విలువలను కాపాడుకోవడానికే వాటిని వదులుకున్నానని మంగ్లీ భావోద్వేగంగా స్పందించారు. తనకు డబ్బు కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని, ఈ స్కామ్‌లో తన ప్రమేయం ఉందని ఏ చిన్న ఆధారం దొరికినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. తనకు సంబంధం లేని వ్యక్తులను తన తమ్ముడని ప్రచారం చేయడం మానుకోవాలని, ఇలాంటి అక్రమ ఆరోపణలను తాను అస్సలు ఉపేక్షించబోనని ఘాటుగా హెచ్చరించారు.ఈ వివాదంలో బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూసే వారిపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. మంగ్లీ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానిజాలు తేలే వరకు తనపై అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె అభిమానులను మరియు మీడియాను కోరారు.

Related News

Select the Topic
Scroll to Top