ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 14
పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్న ఇంకా ఎన్నికలు జరపకుండా కోట్ల రూపాయల సంఘం నిధులు ఇష్టరీతిన వెచ్చించడం పట్ల తెలంగాణ వంజరి సంఘం ముఖ్యుల సమావేశం ఆక్షేపణ వ్యక్తం చేసింది.ఈరోజు తార్నాకలోని తెలంగాణ వంజరి సంఘం కార్యాలయంలో తెలంగాణ వంజరి సంఘం ముఖ్యుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తెలంగాణ వంజరి సంఘం లో జరుగుతున్న పరిణామాలు కులానికి సంఘానికి శ్రేయస్కరం గా లేవని సంఘానికి నూతన బైలా ప్రకారంవెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఉప్పల్ బాగా ఎత్తులో నిర్మిస్తున్న ట్రస్ట్ ట్రస్టును సంఘానికి అనుసంధానం చేయాలని ట్రస్ట్ ను విస్తరించాలని వెంటనే ఎన్నికల కమిటీని ప్రకటించాలని డిమాండ్ చేసింది.
కులస్తులు ఎన్నోసార్లు సమావేశాలు నిర్వహించి సంఘాన్ని పద్ధతి ప్రకారం నడపాలని సూచిస్తే అధికారం బలంతో ఇష్టం ఉన్నట్లు నిధులు వెచ్చిస్తూ సంఘాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి మరి ఉప్పల్ బాగాయత్తు భవనం నిర్మించడం పట్ల సమావేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఆదివారం 19వ తారీఖు నాడు వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్రంలో ఉన్న కులస్తులందరినీ ఏకతాటిపైకి తెచ్చి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వంజరి సంఘం మాజీ అధ్యక్షులు కాలేరు విశ్వనాథం, కొండే బిక్షపతి, , భానుక ఆంజనేయులు సాల్వేరు కృష్ణ, ఎదుగని హరినాథ్ గోపాల్ రమేష్, దాత్రిక ధర్మరాజు, ముజకరి రవీందర్, లవంగు ఆంజనేయులు దాత్రిక కాశీనాథ్ నవాత్ రాజేందర్ పిట్టల అంజయ్య బిల్లంకి నరసింహారావు కాలేరు యుగంధర్ అనంతుల అనిల్ విటల్ రవి, విటల్ నారాయణ దేనిక అనిల్ మహదేవ్ ముండే కేంద్రీ మురళీకృష్ణ కాలేరు సాయి బాబా ఎదగని వెంకటేష్ మల్లా కు ఆనంద్ మైసరి రాధాకృష్ణ పోతనకు సతీష్, రత్నం కోటాజి కొండేరి నగేష్ విటల్ శ్రీనివాసరావు ముజకరి దినేష్ కానుకంటి శివప్రసాద్ వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు















