ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 17;
డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది నిరుపేదలు, అవసరమైన ప్రజలు మరియు ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందజేశారు.సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప సేవ అని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలోని పేద మరియు అవసరమైన వర్గాలకు అండగా నిలవడం కోసం డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ తరచుగా అన్నదాన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలు, వాలంటీర్లు మరియు పాల్గొన్న అందరికీ సొసైటీ ఎక్సగ్యుటీ మెంబర్ జి.మాధవి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.















