EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పొంచి ఉన్న సూపర్ ఎల్సినో…ఆహార భద్రతకు ముప్పు తప్పదా?

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 4:

ఆహార భద్రతకు ముప్పు తప్పదా? వాతావరణ పరిస్థితులు అంతకంతకు అధ్వానంగా మారుతున్నాయి. నిపుణులు ‘తీవ్రస్థాయి సూపర్ ఎల్సినో ముప్పు పొంచి ఉండంటూ హెచ్చరిస్తున్నారు. ఇండియా ఇప్పటికే దాని ప్రతికూల ప్రభావాలకు గురవుతోంది. పైగా ఈ ఏడాది రుతువవన వర్షపాతం దీర్ఘకాలిక నగటులో 90శాతమే ఉంటుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇంతకీ దేశంపై ఎల్సినో ప్రభావం ఎలా ఉండనుంది? దాన్ని సమర్థంగా ఎదుర్కోవడమెలా? వసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో కొన్నాళ్లకిందట తటస్థంగా ఉన్న ‘ఎల్నెనో-నడరన్ అసిలేషన్’ పరిస్థితులు ఎల్నినో పరిస్థితులుగా మారుతున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మన దేశంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్న్ని పరిస్థితులు ఏర్పదేందుకు అవకాశం ఉన్నట్లు భారత ఉష్ణమండల వాతావరణ అధ్యయన సంస్థ (ఐఐటీఎం), భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొన్నాయి. ఇతర అంతర్జాతీయ వాతావరణ నమూనాల అంచనాలూ ఇదే సూచిస్తున్నాయి. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో కనిపిస్తున్న తటస్థ ద్విధ్రువ త(ఐవోడీ) పరిస్థితులు రుతుపవనాల కాలంలోనూ కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే, భారత్లో రుతుపవన కాలంలో ఎలి నినో ఏర్పడి, సెప్టెంబరు వరకు కొనసాగుతుందన్న నూట. దీనివల్ల వర్షపాతం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. అంతవరకు మనం తీవ్రమైన వేడి, పొడి వాతావరణం, అలస్యపు వర్షాలతో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

జీవనోపాధికి గట్టి దెబ్బ పసిఫిక్మహాసముద్రంలో ఏర్పడే ఎల్సినో శీతాకాలం వరకు కొనసాగవచ్చని పలు విదేశీ సంస్థలు సూచిస్తున్నాయి. ఇది మన రుతుపవనాలను తూర్పువైపు పసిఫిక్ మహాసముద్రంలోకి నెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఉపగ్రహ డేటాను పరిశీలిస్తే, ఈ కదలిక స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో నమోదైన తీవ్రస్థాయి వడగాడ్పులు ఎల్సినో సంకేతాలేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈసారి వేసవిలో ఇండియా వివరీతమైన ఉష్ణోగ్రతలను చవిచూసింది. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది నగరాలు మన దేశంలోనే ఉన్నాయని నివేదికలు తెలిపాయి. భారత ఉపఖండంలో నగటి, రాత్రి ఉష్ణోగ్రతలు రెండూ పెరిగాయి. మరోవైపు, హిమాలయాలకు ఉత్తరాన 2000-2500 కిలోమీటర్ల పొడవైన మేమాల సమూహం ఏర్పడింది. ఇది దక్షిణ దిశగా దూసుకొచ్చి గంగా మైదాన ప్రాంతాల్లో వాతావరణ జీభత్సాన్ని సృష్టించవచ్చు. ఈ వింత వాతావరణ పరిణామాల కారణంగా ఒక్క యూపీలోనే 30కి పైగా జిల్లాలు బలమైన గాలులు, తుపానులు, భారీ వర్షాలను చూశాయి.

ప్రజలు దీన్ని వేడి నుంచి ఉపశమనంగా భావించారు. కానీ, నిజానికి ఇది రుతువవనాలు ఉపఖండం లోపలికి విస్తరించకుండా అడ్డుకుంటున్న వాతావరణ వైపరీత్యం! వాతావరణ వరంగా 2026న సంవత్సరం తీవ్రమైన అనిశ్చితికి దారితీయవచ్చు. దీనివల్ల ఇకుట్ల పాలవనున్న వర్షాధార రైతులను ఆదుకోవడం పై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే, మన సేద్య రంగంలో దాదాపు 60 శాతం మంది

వర్షాలపై ఆధారపడినవారే. పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగు ద్వారా దేశానికి పౌష్టికాహారాన్ని అందించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్షపాతం సగటు కంటే తగ్గితే, అది కేవలం ఆహార భద్రతను మాత్రమే కాకుండా, లక్షలాది రైతుల జీవనోపాధిని కూడా నేరుగా దెబ్బతీస్తుంది. ప్రస్తుత అస్థిర, అలన్య వాసల కారణంగా వర్షాధార రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్దతులను అనుసరించడం శ్రేయస్కరం కాదు. గడచిన అయిదేళ్లలో భారతదేశం అతితక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదైన జూన్ నెలను, అత్యంత పొడి వాతావరణం కలిగిన అగస్టు, అక్టోబరు నెలలను చూసింది. తీవ్రమైన వడగాడ్పులు, పశ్చిము వాతావరణ కల్లోలాలు సంప్రదాయ వాతావరణ చక్రాలను పూర్తిగా మార్చేశాయి. దీనివల్ల వర్షాధార రైతులు తీవ్రంగా నష్టపోయి, అప్పుల ఊబిలో దిగబడిపోయారు. గడచిన అయిదేళ్లలో ఒక్క 2025-26లోనే రికార్డు స్థాయిలో ధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, 2021-22 నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం వల్లే గోధుమలు, కొన్ని రకాల బియ్యం, చక్కెర ఎగుసుతులపై తాత్కాలిక నిషేధం విధించాల్సి వచ్చింది. ఈ సమస్యలకు తోడు, ఇరాన్ యుద్ధం వచ్చిపడింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనాలు, ఎరువులు, ఖనిజాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.

నిల్వ సామర్ధ్యం పెంచాలి

ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం తగినన్ని ఎరువులను నిల్వచేసినప్పటికీ, రబీ సీజన్ కుఅవిసరిపోకపోవచ్చు. వాతావరణ వైపరీత్యాలవల్ల వంటల సాగుకు రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం మరింత పెరుగుతుంది. కానీ, ఇప్పటికే వీటికి తీవ్ర కొరత నెలకొంది.. రాబోయే వాతావరణ పరిస్థితులపై విధానకర్తలు రైతులకు అవగాహన కల్పించాలి. ప్రతి జిల్లాలో వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలను అందించాలి. వర్షాధార ప్రాంతాల్లో బహుళ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలి. సేంద్రియ ఆవు పేడ, పెరటి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి. మట్టిలో సేంద్రియ పదార్థం పెరిగేకొద్దీ, నేల నీటిని నిలువుకొనే సామర్థ్యం కూడా పెరుగుతుంది. జీవబొగ్గు (బయోవార్) సాయంతో నేల నాణ్యతను పెంపొందించే పద్ధతులను రైతులు వరిశీలించాలి. పొడి ప్రాంతాల్లో ఎక్కువగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును చేపట్టాలి. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటిని, రసాయనాలను ఆదా చేయడానికి చిరుధాన్యాల సాగు మేలు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోళ్లు పెంచడంతో పాటు ఆర్థిక ప్రోత్సాపాకాలను అందించాలి. వర్షాధార ప్రాంతాల్లో అత్యధిక భూములను వంటల బీమా పథకం వరిధిలోకి తీసుకురావాలి. ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ఎంతైనా అవసరం. ప్రతి గ్రామంలోనూ రైతుల భాగస్వామ్యంతో గిడ్డంగులను ఏర్పాటుచేసి, నిర్వహించేలా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు ప్రతి వల్లెకూ ఆహార భద్రత చేకూరుతుంది.

Related News

Select the Topic
Scroll to Top