ఈతరం భారతం అమరావతి జులై 4 :
వర్షాలపై వాతావరణ నిపుణులు షాకింగ్ న్యూస్ చెప్పారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయని పేర్కొన్నారు. అయితే రుతుపవనాలను చురుగ్గా మార్చడంలో ఈ అల్పపీడనం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురవొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.















