EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ సరికొత్త నోటిఫికేషన్ …

ఈ తరం భారతం హైదరాబాద్ జూలై 4

తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ ధృవీకరణ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మొత్తం 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు ఆకర్షణీయమైన శ్రేణిలో జీతభత్యాలు చెల్లిస్తారు. అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే.. జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక విద్యార్హతల విషయానికొస్తే, అభ్యర్థులు ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన ఏదేని విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ (B.Sc. Ag) తో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి.

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 7, 2026 నుండి ప్రారంభమై, ఆగస్టు 12, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన ను సందర్శించి ప్రొఫార్మా అప్లికేషన్‌ను పూరించవచ్చు. సిలబస్, పరీక్షా విధానం, రిజర్వేషన్లు మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లోని పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను పరిశీలించాలని కమిషన్ సెక్రటరీ తమ ప్రకటనలో స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top