EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ శంకుస్థాపన

ఈతరం భారతం సిద్ధిపెట జులై 4 :

సిద్దిపేట జిల్లా మన్సాన్పల్లి గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ ఆచారి బ్రహ్మంగారి జీడిమెట్ల దేవస్థాన కమిటీ అధ్యక్షులు భాను రీ కృష్ణమాచారి బీసీ కుల సంఘాల ప్రధాన కార్యదర్శి వలబోదు నరసింహ చారి బీసీ కుల సంఘాల రాష్ట్ర స్థానిక పెద్దలు బండోజు నాగభూషణం విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు ఈశ్వర చారి మాజీ అధ్యక్షులు యాదగిరి చారి ములుగు నరసింహులు మల్లెల మల్లేశం గ్రామ సర్పంచులు వార్డు మెంబర్లు విశ్వబ్రాహ్మణ మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ శంకుస్థాపన కార్యక్రమం రంగా రంగా వైభవంగా జరిగినది.ఈ సందర్బంగా కొందారం గణేష్ చారి మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బహుతా భవిష్యత్ వర్తమానం గురించి తెలియజేసిన మాననీయుడు లో కూడా ఇలాంటి వ్యక్తి పుట్టడం జరగలేదు ఇద్దరు మన జాతిలో పుట్టడం మన జాతికే గర్వకారణం 400 సంవత్సరాల పూర్వమే ఇప్పుడు జరిగేది జరగబోయేది భూత భవిష్యత్తు వర్తమానం గురించి తెలియజేసిన మానవుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ఆయన గుడి కట్టడం నిజంగా మన అదృష్టంగా భావించాలి మీరందరూ కలిసికట్టుగా గుడిని అభివృద్ధి చేయాలని కృష్ణమాచారి చెప్పారు వలబోజు నరసింహాచారి మాట్లాడుతూ బ్రహ్మంగారిని పూజించడం చాలా శుభసూచకం అని అన్నారు బ్రహ్మచారి మాట్లాడుతూ అందరూ ఐకమత్యంతో ఉండే జాతిని ముందుకు తీసుకెళ్లాలని ఈ గుడిని కూడా అదే విధంగా అభివృద్ధి పరచాలని మరి వాడ వాడ ప్రతి గ్రామములో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయాలు నిర్మించాలని బ్రహ్మచారి  కోరారు

Related News

Select the Topic
Scroll to Top