ఈతరం భారతం హైద్రాబాద్ జులై 14 :
హైదరాబాద్లోని ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు మానవతా దృక్పథంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అవసరమైన నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు మరియు పేద కుటుంబాలకు ప్రేమతో, గౌరవంతో భోజనం అందజేశారు. సమాజంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప సేవ అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సంస్థ ఎక్సగ్యుటీ మెంబెర్ జి.మాధవి తెలిపారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సమాజ సేవలో భాగంగా ఆరోగ్య, విద్య, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది.















