ఈతరం భారతం హైదరాబాద్: జూలై 16
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ తలారి ప్రేమ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉమా మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకమండలి సభ్యురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈశ్వరమ్మ యాదవ్ కు వారు శుభాకాంక్షలు తెలిపి డాక్టర్ తడక యాదగిరి అనువదించిన భారత రాజ్యాంగ ప్రతిని ఆమెకు బహుకరించారు. అదేవిధంగా మున్సురాబాదులో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈశ్వరమ్మ యాదవ్ కు తమ సంఘీభావాన్ని ప్రకటించి ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.















