ఈతరం భారతం ఖమ్మం జూలై 17
వ్యవసాయంలో రైతులకి నాణ్యమైన సేవలు అందిస్తున్న ప్రముఖ బహుళజాతి కంపెనీ అయినటువంటి బాయెర్ క్రాప్ సైన్సెస్ ఈరోజు తమ నూతన ప్రోడక్ట్ ” ట్రాన్స్ “ని మార్కెట్లోకి ఖమ్మంలో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు
ట్రాన్స్ ప్రోడక్ట్ గురించి ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ట్రాన్స్ అనే మందు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రత్తి , మిరప మరియు ఇతర కూరగాయ పంటల్లో వచ్చే రసంపీల్చు పురుగులు అయినటువంటి పచ్చదోమ, పేనుబంక , తెల్లదోమ , పిండినల్లి ని ఎక్కువకాలం సమర్థవంతంగా నియంత్రించి పంట ఏపుగా , ఆరోగ్యవంతంగా పెరగడానికి దోహదపడుతుంది అని తెలియజేసారు.రైతు సోదరులు ఈ ట్రాన్స్ అనే మందుని ఒక ఎకరాకు 220ML మోతాదులో వాడితే మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపనీ ప్రతినిధులు మార్కెటింగ్ మేనేజర్ అయినటువంటి విక్రమ్ రెడ్డి ,CCM-సందీప్ & భార్గవి మరియు ఉభయ ఖమ్మం జిల్లాల డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి పూనుకొల్లు రామబ్రహ్మం మరియు డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















