ఈతరం భారతం హైద్రాబాద్ జులై 17 :
నూర్ భాషా దూదేకుల కులం వారికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ,రెండు ఎకరాలు భూమిని తక్షణమే అందజేయాలని నూర్ బాషా దూదేకుల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.శుక్రవారం హైద్రాబాద్ లో మీడియా సమావేశం లో తెలంగాణ స్టేట్ నూర్ భాషా ముస్లిం దూదేకుల మైనారిటీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఎంఏ ఖదీర్ ,నూర్ బాషా బాబా ఫక్రుద్దీన్ , రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ మరియు ఆజం నల్లగొండ జిల్లా దూదేకుల నూర్ భాషా సంఘం అధ్యక్షుడు యూసుఫ్ లు మాట్లాడుతూ
టిఆర్ఎస్ ప్రభుత్వం లో కోకాపేటలో రెండు ఎకరాల భూమి దూదేకుల కులస్తులకు కేటాయిస్తామని ప్రకటించడం జరిగింది కావున ఆ రెండు ఎకరాలు భూమిని తక్షణమే కులాలకు అందజేయాలని కోరారు
నూర్ భాషా దూదేకుల జేఏసీ 2016 లోనే ఏర్పడినది దీనికి అధ్యక్షులుగా షేక్ బాబ్జాని గారు ఉన్నారు జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షేక్ ఫకీర్ సాహెబ్ బాధ్యతలు నిర్వహించారు సుదీర్ఘ కాలంగా దూదేకుల కులస్తుల కోసం తమ పోరాటాన్ని సాగించి అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఆ తర్వాత దూదేకుల కులస్తులందరూ ఏకమై షేక్ సయ్యద్ బాషా గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది అప్పటినుంచి దూదేకుల కులస్తుల కోసం తమ బు జ స్కందాలపై మో సుకుంటూ నూర్ భాషా దూదేకుల కులాలకు జరుగుతున్న అన్యాయం కోసం నిరంతరం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఈ మధ్యలోనే కొత్తగా జేఏసీ ఏర్పాటు చేసినారు వీళ్లు వాళ్లంతట వాళ్ళు ప్రకటించుకుని ఏ రోజు కూడా కులం కోసం పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేసిన వ్యక్తులు కారు అప్పటి వ్యక్తులు అయినటువంటి బాబ్జాని గారు వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సయ్యద్ బాషా మరియు దీర్ఘకాలకం కాలంగా కులం కోసం తాపత్రయ పడుతున్న పెద్దలు సత్తార్ అందరూ కలిసి కులంలో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అప్పటి ప్రభుత్వం లో ఉన్నటువంటి బీసీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కూడా దూదేకుల కులస్తులకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దూదేకుల పిల్లలకు విద్యలో ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నది అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అప్పటి బీసీ కమిషనర్ కృష్ణమోహన్ కు మరియు మైనారిటీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి అప్పటి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ కి మరియు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అలాగే ఇప్పటి ప్రభుత్వంలో ఢిల్లీ దీక్ష వేదికలో గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ద్వారా తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించడం జరిగినది అప్పుడు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నూర్ భాషా దూదేకుల కులస్తు లకు గ్రామీణ ప్రాంతాల నుండి అన్యాయం జరుగుతూనే ఉన్నది కాబట్టి వీళ్ళకు న్యాయం చేయడం సమంజసమైన పద్ధతి అని గ్రహించి పది రోజులనే దూదేకుల కులస్తులకు ఒక స్కీం లో ప్రత్యేక స్థానం కల్పించినారు కావున మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేయు వినతి ఏమనగా అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది నూర్ భాషా కులంలో కూడా కార్పొరేషన్ ఇవ్వవలసిందిగా కోరనైనది అంతేకాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం లో కోకాపేటలో రెండు ఎకరాల భూమి దూదేకుల కులస్తులకు కేటాయిస్తామని ప్రకటించడం జరిగింది కావున ఆ రెండు ఎకరాలు భూమిని తక్షణమే కులాలకు అందజేయాలని మనవి అంతేకాకుండా విద్య ఉద్యోగాలలో దూదేకుల కులస్తులకు న్యాయం చేయాలని కోరారు.















