ఈతరం భారతం బాసర జులై 16;
బాసర సరస్వతి సన్నిధి లో అలరించిన అష్టావధానం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు.శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపంలో గల శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ ము కోటి పార్థివశివలింగ శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగమందిర మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దీపారాధన, కలశ స్థాపన ,విఘ్నెశ్వరశ్వర పూజ ,కోటి పార్థివ లింగ , శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకం పుష్పార్చన , బిల్వార్చన , గోపూజ ,గణపతి, నవగ్రహ, రుద్రహోమములు, భూదాన సంకల్ప పూజ, మహా అన్నదానము నిర్వహించారు. .కవితా విద్వన్మణి ,అవధాన విభూషణ విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి అష్టావధానం చేశారు . పద్యకోకిల ,అభినవ చౄళ్ళపిళ్ళ డా..ఓంప్రకాశ్ బోచ్కర్ సంచాలకులు గా,పృచ్ఛకులు గా ..ఆచార్య గొట్లూరి సురెశ్ బాబు(నిషిద్దాక్షరి).,మైరోళ్ళ అశోక్ గౌడు (సమస్య) ,వల్లంభట్ల వనజ ( దత్తపది).,డా.భోగయ చంద్రశేఖర్ శర్మ (వర్ణన) ,గణపురం రాజేదర్ (ఆశువు )పేరంసంధ్యారాణి (న్యస్తాక్షరి)దుర్గి శ్రవణ్ కుమార్ శర్మ (ఛందోభాషణం) డాక్టర్ వెంకన్న జ్యోతి (అప్రస్తుత ప్రసంగం) పృ ఛ్ఛకులుగా పాల్గొన్నారు.















