ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 22
___________________________________
ముషీరాబాద్ నియోజక వర్గం లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎంపీ ఎం.అంజనకుమార్ యాదవ్ ఆయా మం డపాలను దర్శించి ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఈ సందర్బంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను వాడి పర్యావరణ పరి రక్షణకు తోడ్పడాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పి.కవిత, ముషీరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.నరేందర్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయికీర్త్, మారిశెట్టి నర్సింగరావు, జయ,తదితరులు పాల్గొన్నారు.















