ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 22
__________________________________
ఎల్పీజీ గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకునేందుకు అక్టోబరు 1 నుంచి బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రాయితీ ధరలో సిలిండర్‌ను అందించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు కేంద్రం స్పష్టంచేసింది. సిలిండర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చే సిబ్బంది వద్ద డిస్ట్రిబ్యూటర్ షోరూంలో ఓఎంసీ మొబైల్‌యాప్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని సూచించింది. గతంలో ఈ ప్రక్రియను పూర్తిచేసిన వారు మరోసారి చేయనవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.















