EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేయాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత 

ఈతరం భారతం తిరుపతి, అక్టోబర్ 08:రిపోర్టర్ మనోజ్ కుమార్ :

__________________________________________________

 స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లు, సి ఈ ఓ లు, డి పి ఓ లు, మున్సిపల్ కమిషనర్ లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత ఆదేశించారు. గురువారం విజయవాడ లోని రాష్ట్ర సచివాలయం నుండి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల (గ్రామీణ, పట్టణ) ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని మిని విసి హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ యం.జయకృష్ణ, డి ఆర్ ఓ జి.నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరు పేట ఆర్ డి ఓ లు రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, డిపిఓ సుశీలా దేవి, జెడ్ పి డిప్యూటీ సి ఈ ఓ వెంకట నారాయణ, డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, తదితరులు హాజరయ్యారు.    ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ వెంటనే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లు, సీఈఓలు, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. రాబోయే 2–3 రోజుల్లో యూనిట్ వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కారణంగా స్థానిక సంస్థలకు అందాల్సిన ఆర్థిక సంఘం నిధులపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థలకు కలిపి సుమారు రూ. 4 వేల కోట్ల వార్షిక నిధులు అందే అవకాశం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే మొత్తం అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోకి వస్తుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతికత విస్తృతంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top