EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైతులకు కేంద్రం భారీ దసరా గిఫ్ట్.. ప్రతీఒక్కరి అకౌంట్లో రూ.2 వేలు..! జమ చేసేది అప్పుడే..

ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 8:

_____________________________

రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుక అందించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులను దసరా సందర్భంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.దసరా పెద్ద పండుగ కావడంతో రైతుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.అక్టోబర్ 20న దసరా పండగ రానుండగా.. నవంబర్‌లో దీపావళి రానుంది. దీంతో ఏ క్షణమైనా పీఎం కిసాన్ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశముందని చెబుతున్నారు. దీంతో దేశంలోని కోట్లామంది రైతులు ఈ నిధుల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని ఆశగా చూస్తున్నారు.

అక్టోబర్ 20వ తేదీన పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల చేసే అవకాశముందని ప్రచారం సాగుతోంది. 23వ విడత నిధులను జూన్ 20వ తేదీన ప్రధాని మోదీ విడుదల చేశారు. దీంతో నాలుగు నెలలు కావొస్తుండటంతో.. అక్టోబర్ 20న పండుగ సందర్భంగా జమ చేసే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి.

ప్రభుత్వం అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ.. గత విడత జమ చేసి నాలుగు నెలలు కావొస్తుండటంతో 24వ విడత త్వరలో విడుదల చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. డబ్బులను విడదుల చేసేముందు కేంద్రం అధికారికంగా ప్రకటన జారీ చేస్తుంది. దీంతో ఈ ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఖచ్చితమైన డేట్‌ను చూడవచ్చు.

ప్రభుత్వ అధికారిక హ్యాండిల్స్, పోర్టల్స్ ద్వారా రైతులు సమాచారం తెలుసుకోవచ్చు. కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేలు జమ చేస్తోంది. వీటిని డీబీటీ ప్రక్రియ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. మూడు విడతలుగా నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top