ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 8:
___________________________________
అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. F-1 వీసా ఉన్న విద్యార్థులు చదువుకు సంబంధించిన రంగంలో పని అనుభవం పొందే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫీజు 500 డాలర్ల నుంచి ఏకంగా 70,000 డాలర్లకు పెరగనుంది. భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డి ఎచ్ ఎస్) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు, యజమానులు, విద్యా సంస్థలు F-1 వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా అనే విషయాన్ని నిర్ధారించడంతో పాటు మోసాలను అరికట్టడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పటిష్ఠం చేయడం, అమెరికన్ ఉద్యోగులను రక్షించడం ఈ ఫీజు ఉద్దేశమని తెలిపింది.















