ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 8:
___________________________________
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. మూడు నెలల విరామం తర్వాత ఆయన సంపద మళ్లీ 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. సోమవారం ఒక్కరోజే స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పెరగడంతో ఆయన సంపద 65 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత ఆస్తి విలువ 1.04 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ భారీ పెరుగుదలకు ముఖ్య కారణం స్పేస్ఎక్స్ రాకెట్ దూకుడు: ఈ నెలలో స్పేస్ఎక్స్ షేర్లు 13% పెరిగాయి. మోర్గాన్ స్టాన్లీ సానుకూల నివేదిక ఇవ్వడం, అలాగే ‘స్టార్‌షిప్’ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం కావడం షేర్ల దూకుడుకు దోహదపడింది. ఇక టెస్లా మూడో త్రైమాసికంలో అంచనాలకు మించి వాహనాలను డెలివరీ చేయడంతో కంపెనీ షేర్లు 6.7% లాభపడ్డాయి. ప్రస్తుతం కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద కంటే మస్క్ ఆస్తి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. 55 ఏళ్ల మస్క్ ఈ ఏడాది జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత షేర్ల పతనంతో ఆస్తి తగ్గినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పుంజుకుని ట్రిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్న ఏకైక వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పారు.















