ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 8:
______________________________
జన గణన లో బీసీ కుల గణన చేపడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటని, బీసీలను బిజెపి వంచిస్తే మరో స్వాతంత్ర పోరాటం తప్పదని బీసీ సంఘాల నేతలు అఖిలపక్ష పార్టీల నాయకులు నేడు ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా హెచ్చరించారు .
గురువారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జాతి జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ జాతీయ స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు
ఈ సమావేశంలో డి రాజా, కె రామకృష్ణ, (సిపిఐ) వి హనుమంతరావు (కాంగ్రెస్) ఆర్ పప్పు యాదవ్ ( ఎంపీ బీహార్) రాజేష్ షైనీ (మాజీ ఎంపీ, హర్యానా) యోగేంద్ర యాదవ్ (స్వరాజ్ ఇండియా పార్టీ మరియు రాజకీయ విశ్లేషకులు) అరుణ్ కుమార్ (సిపిఎం) సాహూ ( కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాతీయ కన్వీనర్) కేశన శంకర్ రావు (ఆంధ్రప్రదేశ్) ఇంద్రజిత్ సింగ్ (మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ మనుమడు) ఇక్బార్ హన్సారి (ఎంఐఎం) తోపాటు 22 రాష్ట్రాల ఓ బి సి ప్రతినిధులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు సేకరించకుండా కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దేశంలోనీ 80 కోట్ల మంది బీసీల జీవితాలతో బిజెపి ప్రభుత్వం ఆటలాడుకుంటుందని, బీసీల ఆత్మగౌరవని దెబ్బతీస్తూ చిన్నచూపు చూస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికల్లో గద్దె దించుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు బీసీ కాలం చేర్చాలని ప్రధాన డిమాండ్ తో డిసెంబర్ 14 15 తేదీలలో వేలాదిమంది బీసీలతో చలో ఢిల్లీ చేపట్టి పార్లమెంట్ ను ఇబ్బంది ఇస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.















