EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 8:

___________________________________

అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. F-1 వీసా ఉన్న విద్యార్థులు చదువుకు సంబంధించిన రంగంలో పని అనుభవం పొందే ఆప్షనల్ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌  ఫీజు 500 డాలర్ల నుంచి ఏకంగా 70,000 డాలర్లకు పెరగనుంది. భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డి ఎచ్ ఎస్) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు, యజమానులు, విద్యా సంస్థలు F-1 వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా అనే విషయాన్ని నిర్ధారించడంతో పాటు మోసాలను అరికట్టడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పటిష్ఠం చేయడం, అమెరికన్‌ ఉద్యోగులను రక్షించడం ఈ ఫీజు ఉద్దేశమని  తెలిపింది.

Related News

Select the Topic
Scroll to Top