EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: అక్టోబరు 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.

ఈతరం భారతం తిరుపతి అక్టోబర్ 11 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

__________________________________________________

తిరుమలలో అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు,బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన అనుభూతిని కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు స్పష్టం చేశారు.

బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులను సమావేశపరిచి జరగబోవు బ్రహ్మోత్స వాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందస్తు చర్యలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్త లను పలు సూచనలు చేస్తూ అప్రమత్తంగా అధికారులు ఉండాలని ఆదేశించారు.

అక్టోబరు 16న గరుడసేవ, 17న పుష్పకవిమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, ప్రధాన రాకపోకల మార్గాలు, ఘాట్ రోడ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రద్దీ పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. అవసరమైన చోట్ల బారికేడ్లు, దారి సూచిక బోర్డులు, ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని తెలిపారు.తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, పార్కింగ్ నిర్వహణ, గరుడసేవ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర వాహనాలకు మార్గాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అంటే కాకుండా సీసీటీవీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా రద్దీ, ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. తిరుపతి నగరంలో డ్రోన్ల ద్వారా కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తూ తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపు, నేరాల నియంత్రణ, సైబర్ భద్రతతో పాటు వైద్య అత్యవసర పరిస్థితులు, అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో తక్షణమే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల వన్ టౌన్, టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘మే ఐ హెల్ప్ యూ’ టీ-షర్టులు ధరించిన పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సిబ్బంది నాలుగు మాడ వీధుల గ్యాలరీలకే పరిమితం కాకుండా తిరుమలవ్యాప్తంగా భక్తులకు మార్గదర్శనం, సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. దర్శన మార్గాలు, క్యూలైన్లు, వసతి గృహాలు, ఇతర ముఖ్య ప్రదేశాలకు సంబంధించిన సందేహాలు ఉన్నా, ఏదైనా సహాయం అవసరమైనా భక్తులు ఈ సిబ్బందిని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. భక్తుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, వారు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా సహకరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అందులో భాగంగా భక్తులకు కూడా ప్రశ్నించే ముందు చేస్తూ భక్తులు పోలీసు వారికి సహకరించాలని కొనియాడారు

Related News

Select the Topic
Scroll to Top