ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 12;
________________________________
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి పురస్కరించుకొని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ వన్ లో ఏర్పాటు చేసిన జయప్రకాష్ నారాయణ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి బీహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జనతాదళ్ యు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి పి శ్రావణ్ కుమార్ వై.సాంబశివ రావు,వెంకట సుబ్బయ్య, కొలిజేటి రామారావు జేడీయు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు తదితరులు పాల్గొని జయప్రకాశ్ నారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కరణం తిరుపతి నాయుడు మాట్లాడుతూ లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మహోన్నత స్వాతంత్ర్య సమరయోధు డు, సంఘ సంస్కర్త, ప్రజాస్వామ్య పరిరక్షకుడైన జేపీ జాతికి చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, సామా జిక న్యాయ సాధనకు, ప్రజా సేవకు ఆయన జీవితాన్ని అంకితం చేశారని.. ఆయన చూ పిన మార్గం నేటి తరానికి సదా స్ఫూర్తిదా యకమని అన్నారు. జేపీ ఆశయాలు, దేశభక్తి, త్యాగనిరతి తరతరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.















