EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉద్యోగులకు రావలసిన డీఏలను వెంటనే విడుదల చేయాలి : తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్*

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 12:

________________________________

ఉద్యోగులకు రావలసిన డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.నారాయణ గూడా లో జరిగిన తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలపై చర్చించారు. క్రింది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

🔹 ముఖ్య డిమాండ్లు:

1️⃣ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగులో ఉన్న రెండు విడతల కరువు భత్యం

01-01-2024 మరియు 01-07-2024 నుండి రావలసిన 3.64% మరియు 2.73% మొత్తం 6.37% విడుదల చేయుటకు రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయానికి గాను రాష్ట్రప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం సంతోషాన్ని తెలియచేస్తున్నాము.

2️⃣ మిగిలిన 4 డీఏలను వెంటనే మంజూరు చేయాలి.

01-01-2025, 01-07-2025, 01-01-2026 మరియు 01-07-2026 నుండి రావలసిన డీఏలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి.

3️⃣

01-07-2023 నుండి అమలులోకి రావలసిన వేతన సవరణ సంఘం (PRC)ను అమలు చేయాలి వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి

4️⃣ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు CPS విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను అమలు చేయాలి.

5️⃣ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు, బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని,

6️⃣ ఉద్యోగుల హెల్త్ స్కీం ను

సమర్థవంతంగా అమలు చేయాలని,

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా EHSను పటిష్టంగా అమలు చేసి, నగదు రహిత వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని,

7️⃣ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించాలని,

ఉద్యోగులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణం/ఇంధనం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని,

8️⃣ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని,

ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని,సమావేశం డిమాండ్ చేసింది.

ఈ సమావేశం లో ఎమ్. రవీంద్ర కుమార్, అధ్యక్షులు, ఏ. పద్మాచారి గౌరవ చైర్మన్, ch. హరీష్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, v. సురేందర్ ఆర్గనైసింగ్ సెక్రటరీ, p. కృష్ణా రావు, సెక్రటరీ, p. కృష్ణ మూర్తి డైరీ చైర్మన్,ఎన్. నర్సింగ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పవన్ కుమార్, బోరెదా ప్రవీణ్ కుమార్, p. పరమేష్ తదితర కార్యవర్గ సభ్యులు హాజరైనారు.

Related News

Select the Topic
Scroll to Top