ఈతరం భారతం తిరుపతి ఆగస్టు 11 రిపోర్టర్ మనోజ్ కుమార్
తిరుపతి నియోజకవర్గంలోని అవిలాల వద్ద నిర్మాణంలో ఉన్న తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, టీటీడీ బోర్డు సభ్యులు డా. పనబాక లక్ష్మి పరిశీలించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాల కల్పనపై సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో సమగ్రంగా సమీక్షించారు. నిర్మాణ పనులను నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా, నిర్ణీత గడువులో పూర్తి చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ సందర్భంగా డా. పనబాక లక్ష్మి గారు మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఒకే వేదికపై సేవలు అందించే సమగ్ర కేంద్రంగా తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు, నాయకులు మరియు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శాశ్వత కార్యాలయంగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి , పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముని రామయ్య , పార్లమెంట్ సెక్రెటరీ విజయ్ కుమార్ , సోషియల్ మీడియా కోఆర్డినేటర్ రూపేష్ వర్మ పాల్గొన్నారు.















