ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 11;
రేవంత్ ను గద్దె దించడమే మాల అమరులకు నిజమైన నివాళులు అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా 1997 ఆగస్టు 11వ తేదీన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాల మహానాడు వ్యవస్థ అధ్యక్షులు పి వి రావ్ పిలుపు మేరకు ఛలో సెక్రటరియేట్ ముట్టడి లో అసువులు బాసిన గోపతోటి నారాయణ, పాణంగి శేషయ్య, రెడ్డి సుదర్శన్ లకు మాల మహానాడు నేడు హైదర్ గూడ ఎన్ ఎస్ ఎస్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పి వి రావ్ చిత్ర పటానికి పూల మాల వేసిన నివాళ్ళు అర్పించారు.అనంతరం డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ మాల లకే కాదు ఎస్సి వర్గీకరణ తో పేద ఎస్సి ల అందరికి అన్యాయం చేసిన రేవంత్ సర్కార్, బాబు సర్కార్ లకు బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు అనే ఆయుధం తో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మాల లకు పిలుపు ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, డేవిడ్ అలియాస్ అద్దంకి దయాకర్ లు మొదటి నుండి విభీషణ పాత్ర పోసిస్తూ మాల కులాన్ని నాశనం చేస్తున్నారు అందులో భాగంగా నే కొంతమంది బ్రోకర్స్ తిరిగి మల్లు రవిని, గడ్డం వివేక్ ను కలవడం ధర్నాల పేరుతో మాల ల వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నలు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితి లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మాలలు ఓటు వేయవద్దు అని డాక్టర్ పబ్బతి విజ్ఞప్తి చేశారు. ఒక వేల రేవంత్ సర్కార్ కు ఓటు వేస్తె మనల్ని మనం చంపుకోవడానికి వాళ్ళకు కత్తి ఇచ్చినట్లే అని శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి లో ఉమ్మడి హైదరాబాద్ అధ్యక్షులు ఎ ఎన్ వినయ్ కుమార్ కాంటోన్మెంట్ ప్రధాన కార్యదర్శి ఎంజీ వినయ్ కుమార్ ముషీరాబాద్ అధ్యక్షులు కే శేఖర్, నాగరాజు, జెట్టి హరిభూషణ్, తదితరులు హాజరయ్యారు















