EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పలమనేరు: శ్రీ తిరుపతి గంగమ్మ, మారెమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ – ఘనంగా ప్రత్యేక పూజలు

ఈతరం భారతం అక్టోబర్ :04 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల

________________________________________________________

పలమనేరు:

పలమనేరు పట్టణ సమీపంలోని గంటవూరు బీసీ కాలనీలో వెలసిన శ్రీ తిరుపతి గంగమ్మ, మారెమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్, స్వర్ణ నంది అవార్డు గ్రహీత డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజా కార్యక్రమాలు కన్నులపండువగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గంటే నాగరాజ్ భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులందరికీ డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top